Monday, January 20, 2025

మర్మాంగాలను సిగరెట్లతో కాల్చి…. గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడి అనంతరం ఆమె మర్మాంగాల వద్ద సిగరెట్‌తో కాల్చి చిత్రహింసలకు గురి చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు కత్తులతో బెదిరించి గాయపరిచారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి సిగరేట్లతో మర్మాంగాలను కాల్చారు. పదునైన ఆయుధంతో ఛాతీ, చేతులపై దాడి చేశారు. ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని ఆమెను నిందితులు బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు 376, 376డి, 377, 324 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ముంబయిలోని మాతుంగా ప్రాంతంలో ఓ స్కూల్‌లో ఏడో తరగతి విద్యార్థిని క్లాస్‌రూమ్‌లో బంధించి బాలికపై తోటి విద్యార్థులు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News