Friday, December 20, 2024

బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Woman rapped by friend in Hyd's Bachupalli
హైదరాబాద్: బాలికపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్‌కు పాల్పడడంతో పాటు యాబై వేల రూపాయలు ఇవ్వకుంటే వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలికకు సాహిల్ అనే స్నేహితుడు ఉన్నాడు. పథకం ప్రకారం బాలికను గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత బాలికపై ఎనిమిది మంది అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీశారు. వీడియాలతో బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 50 వేల రూపాయలు ఇవ్వకుంటే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. బాలిక డబ్బులు ఇవ్వకపోవడంతో లోకల్ వాట్సాప్ గ్రూపులో వైరల్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News