Monday, December 23, 2024

వీడియోలతో బ్లాక్ మెయిల్… సికింద్రాబాద్ లో బాలికపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

VRA rape attempt on woman in warangal district

 

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన మరవక ముందే సికింద్రాబాద్‌లో మరో బాలికపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో బాలుడు ఉండడంతో పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇన్‌స్టాగ్రామ్‌లో దీరజ్-రితేశ్ అనే యువకులకు ఓ బాలిక పరిచయమైంది. ఆమెకు మాయమాటలు చెప్పి తన దగ్గరకు రప్పించుకొని బాలికపై ఇద్దరు అత్యాచారం చేశారు. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు. వీడియోలు ఇస్తానని చెప్పి బాలిక రమ్మని కబురు పంపారు. బాలిక రాగానే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి దీరజ్-రితేష్ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. బాలిక తీవ్ర మానసిక వేదనకు గురికావడంతో ఆమెను మానసిక నిపుణుడి దగ్గరకు తీసుకెళ్లారు. బాలిక జరిగిన విషయం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన రెండు నెలల ముందు జరిగిందని పోలీసులు వెల్లడించారు. నిందితుల సెల్ ఫోన్లలో వీడియోల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News