Tuesday, December 24, 2024

పుట్టిన రోజు వేడుకలో బాలికపై గ్యాంగ్ రేప్…

- Advertisement -
- Advertisement -

Gang rape on Girl in west bengal

కోల్‌కతా: బర్త్ డే పార్టీలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో జరిగింది. నిందితుల్లో టిఎంసి నేత కుమారుడు ఉండడంతో అతడ్ని కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టిఎంఎసి నేత కుమారుడు పుట్టిన రోజు వేడుకలలో ఓ బాలిక పాల్గొంది. పుట్టిన రోజు వేడుకల నుంచి ఇంటికి వచ్చిన తరువాత బాలికకు కడుపు నొప్పి, తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికత్స పొందుతూ ఆమె మరణించడంతో వెంటనే టిఎంసి నేతల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ కూతురుపై టిఎంసి నేత కుమారుడు, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి టిఎంసి నేత కుమారుడిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. పిల్లలు, మహిళలపై దాడులను సహించామని వెస్ట్‌బెంగాల్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా ఘాటుగా స్పందించారు. నిందితులకు శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News