Wednesday, January 22, 2025

భర్తతో వెళ్తున్న వివాహితపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్‌లో భర్తతో కలిసి సంత నుంచి ఇంటికి వస్తున్న ఓ 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. బొరియో జిల్లాలోని కుమ్రార్ జోరీలో ఆ మహిళ తన భర్తతో కలిసి సంత నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆరేడుగురు వ్యక్తులు వారిపై దాడి చేసి మహిళలను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాను జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా తనను కూడా కొట్టారని భర్త పోలీసులకు తెలియజేశారు. వారి నుంచి తప్పించుకున్న భర్త ముందు సంఘటన గురించి గ్రామస్థులకు తెలియజేశాడు.

Also Read: సచివాలయంపై కెసిఆర్‌కు ఈటల చురక!

మహిళ దుండగుల నుంచి తప్పించుకుని వివస్త్రగా గ్రామానికి చేరుకుంది. అయితే గ్రామస్థులు మొదట ఈ ఘటనను బైటికి పొక్కనివ్వకుండా చూడడానికి ప్రయత్నించారు. చివరికి దంపతులు ధైర్యం చేసి శుక్రవారం బొరియో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట మహిళను చికిత్స కోసం బొరియో కమ్యూనిటీ సెంటర్‌కు తరలించి తర్వాత మెరుగైన వైద్యం కోసం సాహిబ్‌గంజ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బొరియో జిల్లా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి జగన్నాథ్ పన్ తెలిపారు. సంఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులు ఏడుగురినీ అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News