Wednesday, January 22, 2025

సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

పోలీసుల అదుపులో ఒక పరారీలో ముగ్గురు

మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్ : ఓ మహిళను ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధ్ద రాత్రి గండి మైసమ్మలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం…. షోలాపూర్ నుంచి రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన ఓ మహిళ (30) ను ఇమామ్ (20), కుద్దుస్ (21), ఉమృద్దిన్ (21), నరసింహా (23)లు శుక్రవారం అర్ధరాత్రి గండిమైసమ్మలోని ఉజ్వల బార్ వెనుకాల ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు 100కు సమాచారం అందించడంతో దుండిగల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకు న్నారు. ఇమామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా మిగతా నింది తులు అక్కడి పరారయ్యారు. వీరిని గండిమైసమ్మలోని బస్తీ వాసులు, ఆటో డ్రైవర్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News