Wednesday, January 22, 2025

ఒంగోలులో బైక్ తో ఢీకొట్టి…. మహిళపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Sixteen-year-old girl raped in Rajanna Sirisilla

 

మన తెలంగాణ/ ఒంగోలు న్యూస్: కూరగాయలు అమ్ముకొని ఇంటికి వెళ్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ కూరగాయలు అమ్మడం కోసం ప్రతీ రోజు ఒంగోలుకు తన ద్విచక్రవాహనంపై వెళ్తోంది. గురువారం రాత్రి పది గంటల సమంయలో సదరు మహిళ తిరిగి తన గ్రామానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి వివాహితపై అత్యాచారం చేశారు. రాత్రి ఐనా ఆమె రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చారు. ఆమె కనిపించడంతో జరిగిని సంఘటన తన కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెపై చెరువు కాపాలదారులు అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News