Sunday, December 22, 2024

దొంగలు ఇంట్లోకి చొరబడి… భర్త ఎదుటే గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్: దొంగలకు ఇంట్లోకి చొరబడి భర్త ఎదుటే భార్యపై నలుగురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో జరిగింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూప్‌గంజ్‌లో నలుగురు దుండగులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. దంపతులను బెదిరించి రూ 1400 నగదు, బంగారు, వెండి ఆభరణాలు లాక్కున్నారు. అనంతరం భర్తను కట్టేసి భార్యపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు.

భర్త ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని దాచిపెట్టాడు. రెండు రోజుల తరువాత భార్య తన భర్తతో కలిసి రోహిడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే ఆమెను ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒక దుండగుడు మాత్రం పరారీలో ఉన్నాడని పోలీస్ అధికారి దేవరామ్ తెలిపారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ గా తీసుకొని ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News