Thursday, April 3, 2025

తీహార్ జైలులో గ్యాంగ్‌వార్… టిల్లు మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తీహార్‌లోని మండోలి జైలులో గ్యాంగ్ వార్ జరిగింది.  ప్రత్యర్తి యోగేశ్ తండా తన అనుచరుడు దీపక తీతర్‌తో కలిసి సునీల్ అలియాస్ టిల్లు తాజ్‌పురియాపై ఐరన్ రాడ్‌తో దాడి చేయడంతో అతడు చనిపోయాడు. గ్యాంగ్ వార్ లో భాగంగా తాజ్‌పూరియా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని వెల్లడించారు. ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల కేసులో తాజ్‌పూరియా నిందితుడిగా ఉన్నాడు. ఖైదీల మధ్య ఘర్షణపై విచారణకు ఆదేశించామని జైలు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో రోహిత్ అనే ఖైదీ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గతంలో జితేందర్ గోగి గ్యాంగ్‌లో యోగేష్ తండా షూటర్‌గా పని చేశాడు.

Also Read: అతడికి 65… ఆమెకు 16… అత్తకు పదోన్నతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News