చెన్నై: పాత కక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహంతో సెల్ఫీ దిగిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని మానాలీ టౌన్‌లో జరిగింది. వ్యాట్సాప్‌లో ఆ పోటోలు వైరల్ కావడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రవిచంద్రన్ (32) అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో మదన్ కుమార్ అనే వ్యక్తితో రవిచంద్రన్‌కు గొడవలు జరిగాయి. ఈ తగాదా మనస్సులో పెట్టుకొని ఒక రోజు రవిచంద్రన్‌ను మద్యం సేవించడానికి మదన్ కుమార్ ఆహ్వానించాడు. మదన్ కుమార్ అతడి స్నేహితులు ధనూష్, జయప్రకాశ్, ఎస్ భారత్ అందరూ కలిసి మధ్య సేవించారు. మద్యం మత్తులో రవిచంద్రన్‌తో మదన్ మళ్లీ గొడవ పడ్డాడు. బీర్ బాటళ్లతో రవిచంద్రన్‌పై నలుగురు విచాక్షణరహితంగా దాడి చేశారు. ఆ తరువాత మృతదేహంతో సెల్ఫీలు దిగారు. మృతదేహంతో నలుగురు సెల్ఫీలు దిగారు. రవిచంద్రన్ ఇంటికి రాకపోయే సరికి తన బంధువులతో కలిసి అతడి భార్య కీర్తన వెతికింది. ఎంఆర్‌ఎఫ్ గ్రౌండ్‌లో రక్తపు మడుగులో రవిచంద్రన్ శవంగా కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వ్యాట్సాప్ డిపిలలో మృతదేహంతో సెల్ఫీలు దిగిన ఫోటోలు పెట్టుకున్నారు. సెల్ఫీల ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని పోలీస్ అధికారి సందీప్ రాయ్ తెలిపాడు.
హత్య చేసి మృతదేహంతో సెల్ఫీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -