Thursday, January 23, 2025

సైబరాబాద్‌లో గ్యాంగ్ వార్

- Advertisement -
- Advertisement -

టిబ్యూరోః రెండు గ్యాంగ్‌ల మధ్య నెలకొన్న వైరం హత్యలు చేసుకునేంత వరకు వెళ్లింది. పగలతో రగిలిపోతున్న రెండు గ్యాంగులకు చెందిన వారు దాడులు చేసుకునేందుకు ప్లాన్ వేశారు. దీనికి అనుగుణంగా ఆయుధాలు, బెల్లెట్లు, కత్తులు సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం పోలీసులకు ముందుగా తెలియడంతో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, బుల్లెట్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఇమ్రాన్, సూరజ్ గ్యాంగ్‌ల మధ్య గతకొంత కాలం నుంచి వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు భారీగా ఆయుధాలు సమకూర్చుకున్నారు. జగద్గిగిరిగుట్టలో దాడి చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఈ విషయం బలానగర్ పోలీసులకు తెలియడంతో వెంటనే రెండు గ్యాంగులకు చెందిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News