Thursday, September 19, 2024

పాతబస్తీలో గ్యాంగ్ వార్

- Advertisement -
- Advertisement -

Gang war in old city in Hyderabad

యువకుల మధ్య ఘర్షణ
డబీర్‌పురా పిఎస్ పరిధిలో సంఘటన
అద్నాన్ పరిస్థితి విషమం

మనతెలంగాణ, హైదరాబాద్ : పాతబస్తీలో మరోసారి రెండు గ్యాంగుల కొట్టుకున్నాయి. గత కొంత కాలం నుంచి వివిధ ముఠాలు కొట్టుకుంటున్నాయి. చిన్ని చిన్న విషయాలకే ఇరు గ్యాంగులు తన్నుకుంటున్నారు. డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్‌గూడ జైలు సమీపంలో ఆదివారం రాత్రి కొందరు యువకులు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. చిన్న వివాదంతో మొదలైన ఘర్షణ పెద్దదిగా మారింది. యువకులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అజీబ్, ముజీబ్, కమ్రాన్ చేసిన దాడిలో అద్నాన్, అతడి గ్యాంగ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యర్థులు కొట్టిన దెబ్బలకు తాళలేక అద్నాన్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలంలోనే కుప్పకూలాడు, వెంటనే అక్కడ ఉన్న వారు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అద్నాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డబీర్‌పురా పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News