Saturday, November 16, 2024

బిహార్‌లో చిక్కుకుపోయిన గంగా విలాస్‌ క్రూయిజ్‌…

- Advertisement -
- Advertisement -
మూడో రోజునే పర్యాటకులకు చుక్కలు!

ఛప్రా(బిహార్):   ప్రధాని మోడీ ప్రారంభించిన గంగా విలాస్‌ క్రూయిజ్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. బిహార్‌లోని ఛప్రా వద్ద గంగలో నీటి లోతు తక్కువగా ఉండటంతో క్రూయిజ్‌ చిక్కుకుపోయింది. 51 రోజులపాటు ప్రయాణించే ఈ గంగా విలాస్‌ క్రూయిజ్‌ యాత్రను ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం ప్రారంభించారు. క్రూయిజ్‌ ప్రయాణం సాఫీగా సాగేందుకు పర్యాటక శాఖ అధికారులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.

బిహార్‌లోని పురావస్తు ప్రదేశమైన చిరాంద్‌ను సందర్శించేందుకు పర్యాటకులు దిగారు. వీరిని తిరిగి క్రూయిజ్‌లోకి తీసుకొచ్చేందుకు వీలుగా ఒడ్డున నిలిపివేశారు. డోరిగంజ్‌ ప్రాంతం సమీపంలో గంగా నదిలో నీటి లోతు తక్కువగా ఉండటంతో క్రూయిజ్‌ ముందుకు కదలక మొరాయించింది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పర్యాటకులను కాపాడింది. చిరంద్ సరన్ చేరుకోవడానికి పర్యాటకులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీరు చిన్న పడవల్లో అక్కడికి చేరుకున్నారు. చిరంద్‌లో పర్యాటకుల కోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు ఛప్రా సిఓ సతేంద్ర సింగ్ తెలిపారు. గంగానదిలో నీరు తక్కువగా ఉండటంతో క్రూయిజ్‌ను ఒడ్డుకు చేర్చడంలో ఇబ్బంది ఏర్పడిందని, అందుకోసం చిన్న బోట్ల ద్వారా పర్యాటకులను తీసుకొచ్చినట్లు ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఒకరు తెలిపారు.

డోరిగంజ్ బజార్ సమీపంలో ఛప్రాకు ఆగ్నేయంగా 11 కి.మీ దూరంలో ఉన్న చిరంద్ సరన్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన పురావస్తు ప్రదేశం. ఘఘ్రా నది ఒడ్డున నిర్మించిన స్తూపనుమాలు హిందూ, బౌద్ధ, ముస్లింల ప్రభావాలతో ముడిపడి ఉన్నట్లు చూపుతాయి. గంగా నది ఒడ్డున నీరు తక్కువగా ఉండటంతో విహారయాత్రీకులను ఒడ్డుకు చేర్చడం కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న గంగా విలాస్‌ క్రూయిజ్‌ వేగం గంటకు 12 కిలోమీటర్లు. మురుగునీటి శుద్ధి ప్లాంట్‌తో పాటు ఆర్‌ఓ వ్యవస్థ కూడా ఉన్నది. మన వద్ద దీని టిక్కెట్‌ ధర రోజుకు రూ.25 వేలు కాగా, బంగ్లాదేశ్‌లో రూ.50 వేలుగా నిర్ణయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News