Thursday, January 23, 2025

బాలికను పబ్బులో పార్టీకి పిలిచి.. ఆరుగురు యువకుల అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

Gangrape on Girl in Pub in Jubilee Hills

మన తెలంగాణ/సిటీబ్యూరో: పబ్బులో పార్టీకని పిలిచి అత్యాచారం చేసిన కేసులో నిందితులు పరారీలో ఉండగా పోలీసులు గురువారం నిందితుల కారును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌కు చెందిన బాలిక (17)ను జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని అమ్నేషియా ఇన్సోనియా పబ్‌కు బాలిక స్నేహితులు సూరజ్, హాడీ గత నెల 28వ తేదీన పార్టీకి పిలిచారు. అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో బెంజి, ఇన్నోవా కార్లలో ఆరుగురు యువకులు బాలికను తీసుకుని వెళ్లారు. అనంతరం వీరు బాలికపై అత్యాచారం చేయడం తో సృ్పహ కోల్పోయింది.
రెండు గంటల తర్వాత బాలికకు స్పృహ రావడంతో ఇంటికి తిరిగి వచ్చింది. బాలిక మెడపై గాయాలు ఉండటంతో విషయం తెలుసుకున్న తండ్రి తన కుమార్తెపై ఆరుగురు యువకులు అత్యాచారం చేశారని జూబ్లీహిల్స్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిసి టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు, యువకులు వచ్చిన బెంజ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

Gangrape on Girl in Pub in Jubilee Hills

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News