- Advertisement -
హైదరాబాద్: బిజెపి ఎంపి ధర్వపురి అర్వింద్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గతకొంత కాలంగా ఎంపి అర్వింద్ వ్యవహరిస్తున్న తీరు, ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం జరుగుతుందని బిజెపి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఎంపి అరవింద్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ పార్లమెంట్లోని ఆర్మూర్, బోధన్, బాల్కొండకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఎంపి అర్వింద్ ఎవరితోనూ సంప్రదించకుండా 13మండలాల అధ్యక్షులను మార్చారని, సొంత పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తున్నారు.
- Advertisement -