Friday, January 10, 2025

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘లో విశ్వక్ విశ్వరూపం.. టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో విభిన్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఇందులో విశ్వక్ సేన్ ‘లంకల రత్న‘ అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సందర్భంగా కథానాయకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ “టీజర్‌లో మీరు చూసింది ఒక్క శాతమే. సినిమా మీ అంచనాలకు మించేలా ఉంటుంది.

ఈ సినిమా తరువాత.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి తరువాత అనేలా నా కెరీర్ ఉంటుంది”అని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. “ఇది చాలా రోజుల తర్వాత విశ్వక్ నటించిన పక్కా మాస్ సినిమా. ఈ మూవీ ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది మొదటి షో కి తెలిసిపోతుంది. ఈ ఎన్నికల హడావుడి ముగిశాక ట్రైలర్‌ను విడుదల చేసి ప్రమోషన్స్ జోరు పెంచుతాం”అని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ “ఈ సినిమాలో విశ్వక్ విశ్వరూపం చూస్తారు. నేహా శెట్టి, అంజలి పాత్రలు కూడా చాలా బాగుంటాయి”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కథానాయికలు నేహా శెట్టి, అంజలి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News