Friday, December 20, 2024

ఓటిటి లోకి రాబోతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కృష్ణ చైతన్య దర్శకత్వం నెరిపిన, విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ త్వరలో ఓటిటి లోకి రాబోతోంది. ఈ సినిమా మే 31న విడుదలయింది. బీదవాడు గొప్పవాడు కావడం అనే ఇతివృత్తంపై కథ ఉంటుంది. అయితే ఈ సినిమా త్వరలో ‘నెట్ ఫ్లిక్స్’ లోకి రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో  జూన్ 14 నుంచి చూడొచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వర్షన్స్ లో విడుదలయింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేదు. ఈ మధ్య రేట్లు విపరీతంగా పెరిగిపోయినందున సినీ గోయర్లు సినిమాలకు వెళ్లడమే తగ్గించేశారు. థియేటర్లలో 30 శాతం సీట్లు నిండడం కూడా కష్టసాధ్యంగా ఉంటోంది. అందుకే అనేక సినిమాలు రిలీజయిన కొద్ది రోజులకే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. దీనికి ముందు ‘కృష్ణమ్మ’ అనే సినిమా కూడా అమేజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News