Wednesday, January 22, 2025

ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ అమృత్పాల్ సింగ్(22) మృతి..

- Advertisement -
- Advertisement -

ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ అమృత్పాల్ సింగ్(22) మృతి చెందాడు. ఇటీవల అరెస్టైన అమృత్పాల్ సింగ్.. బుధవారం అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జండియాలా గురు ప్రాంతంలో దాచిన 2 కిలోల మాదకద్రవ్యాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు.. అమృత్పాల్ సింగ్ ను పోలీసులు అక్కడి తీసుకెళ్లారు. ఈ క్రమంలో దాచిన గన్ తో
పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అమృత్పాల్ సింగ్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సతీందర్ సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News