Thursday, April 3, 2025

ఎన్‌కౌంటర్లో గ్యాంగ్‌స్టర్

- Advertisement -
- Advertisement -

ఆగ్రా: పోలీసులుతో అగ్రాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఫిరోజాబాద్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వినయ్ బుధవారం ఉదయం హతమయ్యాడు. పోలీసుల కస్టడీ నుంచి పరారైన అతడిపై రూ.50వేల రివార్డు ఉందని ఆగ్రా పోలీసులు తెలిపారు. పోలీసులుపై గ్యాంగ్‌స్టర్ వినయ్ శ్రోతియా జరిపాడని, అనంతరం ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో వినయ్ గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. గాయపడిన వినయ్‌ను సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. ఆగ్రాలోని సికింద్రా పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున 34గంటల సమయంలో అక్బర్ రోడ్‌లో మోటార్‌బైక్‌పై వినయ్ వెళుతున్నట్లు సమాచారం అందింది.

సికింద్రా పోలీస్ టీమ్, ఎస్‌టిఎఫ్ అతడిని చుట్టుముట్టగా కాల్పులు జరిపాడు. వినయ్ కూడా ఉన్న అతడి సహచరుడు ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఉండటంతో పారిపోయాడని ఎసిపి మయాంక్ తివారీ తెలిపారు. వినయ్‌పై పలు కేసులు నమోదవడంతో గతేడాది జులై 13న పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తీసుకువెళ్లారు. కోర్టు ఆవరణలో వినయ్, అతడి సహచరుడు కానిస్టేబుల్ తలపై ఇటుకతో దాడిచేసి పారిపోయారని ఎసిపి తివారి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News