- Advertisement -
న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను ఉగ్రవాద నిరోథక చట్టం కింద ఉగ్రవాదిగా సోమవారం భారత్ ప్రకటించింది. నిషేధించిన ఉగ్రవాద గ్రూపు బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ తో గోల్డీ బ్రార్‌కు సంబంధం ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. గోల్డీ బ్రార్ ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. పంజాబ్‌లో దోపిడీలు, సరిహద్దుల నుంచి అక్రమంగా ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు. పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య తరువాత కెనడాకు గోల్డీ బ్రార్ మకాం మార్చాడు. అతనిపై హత్య, హత్యాయత్నం, ఆయుధాల స్మగ్లింగ్ తదితర 13 నేరాల కేసులున్నాయి. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది.
- Advertisement -