Thursday, December 26, 2024

లేడీ డాన్‌కు తాళికట్టిన గ్యాంగ్‌స్టర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేడి , రౌడీ షీటర్ , లేడీ డాన్ అనురాధ చౌదరి అలియాస్ మేడం మింజ్ ఒక్కటయ్యారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మంగళవారం వారి పెళ్లి జరిగింది. కోర్టు అనుమతితో ఆరు గంటల పరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన సందీప్ నేరుగా ఢిల్లీలోని దర్వారకా సెక్టార్ 3లో ఉన్న పెళ్లి వేదిక సంతోష్ గార్డెన్ చేరుకున్నాడు. సందీప్ న్యాయవాది పెళ్లి వేడుక కోసం బాంక్వెట్ హాలును రూ. 51,000 చెల్లించి బుక్ చేశాడు.

హర్యానాలోని సోనిపట్ నుంచి తానే ఎస్‌యువిని డ్రైవ్ చేస్తూ వధువు అనురాధ చౌదరి కళ్యాణ మండపానికి చేరుకోవడం విశేషం. వధూవరులిద్దరూ పేరుమోసిన గ్యాంగ్‌స్టర్లు కావడంతో ప్రత్యర్థుల నుంచి ఎటువంటి మప్పు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ స్థాయిలో బాంక్వెట్ హాలు చుట్టూ మోహరించారు. ఒకప్పుడు వాంటెడ్ క్రిమినల్ అయిన సందీప్‌పై రూ. 7 లక్షల నగదు రివార్డు కూడా ఉంది. అనురాధపై కూడా అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News