Friday, January 10, 2025

మాజీ మోడల్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

మోడల్ దివ్యా పహూజా దారుణ హత్యకు గురైంది. ఒకప్పుడు మోడలింగ్ లో రాణించి ఎంతో పేరు గడించిన దివ్య కొంతకాలంగా జైలు జీవితం గడిపి, ఇటీవలే బయటకొచ్చింది. అంతలోనే ఆమె హత్యకు గురి కావడం సంచలనం రేకెత్తించింది.

సందీప్ గడోలీ అనే గ్యాంగ్ స్టర్ 2016లో ఒక నకిలీ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. అప్పటికి అతని ప్రియురాలిగా ఉన్న దివ్య పహూజా ఇచ్చిన సమాచారం మేరకే దుండగులు కాపు కాచి సందీప్ ను హత్య చేశారని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో దివ్య అరెస్టయింది. ఏడేళ్లపాటు జైలు జీవితం గడిపిన దివ్య కొన్ని నెలల క్రితం బెయిల్ పై బయటకు వచ్చింది. అయితే ఆమెను మంగళవారం రాత్రి గురు గ్రామ్ లో అభిజిత్ సింగ్ అనే హోటల్ యజమాని తీసుకువెళ్లి, హోటల్ రూమ్ లో తుపాకీతో కాల్చి చంపాడని పోలీసులు చెప్పారు. కొన్ని అశ్లీల ఫోటోలు చూపి దివ్య తనను బెదిరిస్తోందని, అందుకనే ఆమెను చంపేశాననీ అభిజిత్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. అభిజిత్ తో పాటు హోటల్ లో పనిచేసే మరో ముగ్గురు వర్కర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన సిసి టివి ఫుటేజీని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. దివ్య మృతదేహాన్ని ఒక తెల్లటి దుప్పటిలో చుట్టి లాక్కెళ్తున్న దృశ్యాలు సిసి టివిలో రికార్డయ్యాయి.

ఈ కేసులో సందీప్ గడోలీ సోదరి సుదేశ్, సోదరుడు బ్రహ్మ ప్రకాశ్ ల హస్తం ఉందని దివ్య పహూజా సోదరి నైనా పహూజా ఆరోపించారు. వారిద్దరూ అభిజిత్ కు డబ్బులిచ్చి హత్య చేయించారని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News