Tuesday, January 21, 2025

తీహార్ జైలులోకి కత్తులు ఎలా వచ్చాయి: ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియాపై ప్రత్యర్థి గ్యాంగుకు చెందిన ఖైదీలు జైలులో దాడిచేసిన సందర్భంలో దొరికిన నాలుగు కత్తులు ఎక్కడివని ఢిల్లీ హైకోర్టు సోమవారం తీహార్ జైలు అధికారులను ప్రశ్నించింది. జైలు ప్రాంగణంలో అమర్చిన సిసిటివి కెమెరాలలో మొత్తం దాడి దృశ్యాలు రికార్డయినప్పటికీ జైలు అధికారులు దాడిని నిలువరించేందుకు ఎందుకు ప్రయత్నించలేదని కోర్టు ప్రశ్నించింది.

మే 2న తీహార్ జైలులో జరిగిన దారుణ హత్యపై సిబిఐ దర్యాప్తు కోరుతూ తేజ్‌పురియా తండ్రి, సోదరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిడైరెక్టర్ జనరల్(ప్రిజన్స్, ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు కమిషనర్‌కు )జస్టిస్ జస్మీత్ సింగ్ నోటీసులు జారీచేశారు.
డిటిసి డ్రైవర్లమైన తమకు కూడా భద్రత కల్పించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ న్యాయమూర్తిని కోరారు. పిటిషనర్లకు భద్రత కల్పించాలని ఆదేశించిన న్యాయమూర్తి జైలులో నాలుగు కత్తులు ఎలా లభించాయో పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. మే 25న తదుపరి విచారణకు తీహార్ జైలు సూపరింటెండెంట్ హాజరు కావాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News