Sunday, December 22, 2024

జిల్లా పరిషత్ చైర్మన్‌గా రౌడీగారి పెళ్లాం

- Advertisement -
- Advertisement -

రోహతక్: హర్యానాలోని రోహతక్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పేరుమోసిన రౌడీషీటర్ రాజేష్ అలియాస్ సర్కారీ భార్య మంజు మంగళవారం ఎన్నికయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో 5వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మంజు గెలుపొందిన అనంతరం మరికొందరు సభ్యులతో కలసి బిజెపిలోకి ఫిరాయించారు.

బిజెపి జిల్లా అధ్యక్షుడు అజయ్ బన్సాల్ సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్న మంజుకు జెడ్‌పి చైర్‌పర్సన్ పీఠం లభించింది. మంజు భర్త 38 ఏళ్ల రాజేష్‌పై హత్య, హత్యాయత్నం, డబ్బు కోసం బెదిరింపులు, కిడ్నాపులు తదితర అనేక నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లకు పైగా జైలులో గడిపిన రాజేష్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యాడు. జిల్లా సమగ్రాభివృద్ధికోసమే తాను బిజెపిలో చేరానని జెడ్‌పి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన మంజు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News