Friday, January 10, 2025

నార్సంగి పరిధిలో కిడ్నాప్ ముఠా హల్ చల్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: నార్సంగి పరిధిలో సోమవారం ఉడయం కిడ్నాప్ ముఠా హల్ చల్ చేసింది. జన్వాడా చౌరస్తాలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి ముఠా సభ్యులు యత్నించారు. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కారులో వచ్చిన వ్యక్తులు కత్తులతో బెదిరించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. బలవంతంగా కారులోకి ఎక్కిస్తుండగా స్థానికులు చూసి ప్రతి ఘటించారు. వ్యక్తిని అపహరించకుండా ముఠా సభ్యులను ప్థానికులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో కిడ్నాప్ ముఠా సభ్యులు పారిపోతుండగా స్థానికులు పట్టుకొని చితకబాదారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్ప పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News