Friday, December 27, 2024

ఆస్కార్ బరిలో ‘గంగూభాయ్ కతియావాడి’?

- Advertisement -
- Advertisement -

Gangubai Kathiawadi in the Oscar race

ఆలియాభట్ కీలక పాత్రలో నటించిన ‘గంగూభాయ్ కతియావాడి’ చిత్రం ఈసారి ఆస్కార్ బరిలో ఉండనుందనే వార్త బాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ పాత్రలో ఆలియా నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు విమర్శకులు ప్రశంసలు కూడా అందుకొంది. తాజాగా ఈ చిత్రాన్ని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇక గంగూభాయ్ చిత్రం ఆస్కార్ బరిలో నిలుస్తోందని దర్శకుడు భన్సాలీ తెలిపారు. దీంతో ఆలియా అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News