Sunday, December 22, 2024

అలియాభట్ ‘గంగూబాయి కతియావాడి’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

Gangubai Kathiawadi Trailer Released

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ ట్రైలర్ విడుదలైంది. 1960 దశకంలోని కథ ఇది. 3 నిమిషాల కంటే తక్కువ నిడివి గల ఈ ట్రైలర్‌లో అలియా భట్ పాత్రను పరిచయం చేశారు. ఆమె అవమానాన్ని అహంకారంగా మార్చుకుంది. రాజకీయాల్లో కూడా తన ముద్ర వేయాలని కోరుకుంటోంది. వేశ్యలు, వారి కుటుంబాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చైతన్యంతో నిండి ఉంది. గంగూబాయి పాత్రలో ఆలియా భట్ చాలా చక్కగా నటించింది. ఇక గంగూబాయి ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన మాఫియా డాన్ కరీం లాలాగా అజయ్ దేవగణ్ కనిపించాడు. వీరిద్దరి మధ్య పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బన్సాలీ ప్రొడక్షన్స్‌తో కలిసి పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. ‘గంగూబాయి కతియావాడి’ సినిమా ఈనెల 25న విడుదలకు సిద్ధంగా ఉంది.

Gangubai Kathiawadi Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News