Wednesday, January 22, 2025

ఆంధ్ర నాయకుల ముసుగులో మళ్లీ వస్తున్నారు: గంగుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరుసగా మూడు సార్లు తనని గెలిపించారని, తన కంటే ముందు అనేకమంది ఎంఎల్ఎలు, మంత్రులు ఉన్నారని కానీ అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉండేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో గంగుల మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని, ఇవాళ 300 కోట్లతో తెలంగాణలో కరీంనగర్ అభివృద్ధి చేసుకున్నామని, హిందూ ముస్లింలు కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఇక్కడ మత సామరస్యాన్ని కాపడామని, అభివృద్ధి సాధించామని స్పష్టం చేశారు. ఆంధ్ర నాయకులు బిజెపి, కాంగ్రెస్ ముసుగు వేసుకుని వస్తున్నారని దుయ్యబట్టారు. సిఎం కెసిఆర్ కు సరితూగే నాయకుడు లేడని, ఢిల్లీ పాలకుల చేతుల్లో పెడితే మన భవిష్యత్ ఆగం అవుతుందని మంత్రి గంగుల హెచ్చరించారు. కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా ఎంఎల్ఎ గా మంత్రిగా ఉన్నా ఏ పదవిలో ఉన్నా ప్రజల మధ్యనే ఉన్నానని స్పష్టం చేశారు. మరోసారి గెలిపించి బలం ఇవ్వాలని అభివృద్ధిని కొనసాగించాలని కోరారు.

Also Read: అరవింద్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News