Sunday, December 22, 2024

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రులు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సందడి మొదలైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ కొనసాగుతోంది. దీంతో తమ నియోజకవర్గాల్లో పలువురు మంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దంపతులు వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలికల హైస్కూల్లో ఓటు వేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఖమ్మంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ బూత్‌లోని సామాన్య ప్రజలతోపాటు క్యూలైన్‌లో వెళ్లి ఆమె ఓటు వేశారు.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో మంత్రి  శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి ఓటు వేశారు.

బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూ లైన్ ద్వారా ఓటు వేశారు.

సాయంత్ర 5 గంటలకు వరకు పోలింగ్‌ కొనసాగనున్నది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరుగనున్నది. కాగా, ఎన్నికల అధికారులు ప్రజలు ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News