Sunday, December 22, 2024

ఉచిత విద్యుత్ రద్దు కాంగ్రెస్ పార్టీది: గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా నేడు తెలంగాణ చౌక్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీయడం జరిగింది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందని విమర్శించారు. దీన్ని తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

Also Read: ప్రియుడి కోసం వచ్చి ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ప్రియురాలు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News