- Advertisement -
హైదరాబాద్: ఈ రోజు వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రేపటి నుంచి వచ్చే ధాన్యంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. ధాన్యం కొనుగోలుపై ఇంత వరకు లిఖితపూర్వక హామీ ఇవ్వలేదన్నారు. యాసంగి ధాన్యం కొనలేమని కేంద్రం కచ్చితంగా చెబుతోందని, దీంతో యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. గోదాముల్లో ఖాళీ ఉంచాలని ఇప్పటివరకు కేంద్రానికి ఇప్పటి వరకు ఏడు సార్లు లేఖలు రాశామని, ఇవాళ, రేపు అంటూ కాలాయాపన చేస్తోందని మండిపడ్డారు. ఎక్కడ బియ్యం అక్కడే నిలిచిపోయాయని గంగుల స్పష్టం చేశారు. తెలంగాణ బియ్యం తీసుకునే ఉద్దేశం కేంద్రానికి లేదని ఎద్దేవా చేశారు. గోదాముల నుంచి బియ్యాన్ని తరలించే బాధ్యత కేంద్రానిదేనని గంగుల స్పష్టం చేశారు.
- Advertisement -