- Advertisement -
కరీంనగర్: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రైతు నిరసన దీక్షలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్ధాలు ఆడుతున్నాడని, రాజ్యాంగం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. వరి పంట కొనకపోతే బిజెపికి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు నూకలు తినమని కేంద్ర మంత్రి అవమాన పరిచారని, తెలంగాణపై ప్రేమ ఉంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలన్నారు. కేంద్రం దిగి వచ్చే వరకూ ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామన్నారు.
- Advertisement -