Thursday, December 26, 2024

ఆర్‌అండ్‌బి అతిథి గృహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: ఆర్‌అండ్‌బి అతిథి గృహామును సకల హంగులతో స్మార్ట్‌సిటీకి సమానంగా అద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బి అతిథి గృహా నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అధికారులతో, కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, ఇప్పటి వరకు ఎక్కడా చూడని విధంగా రూ. 12 కోట్లతో అత్యాధునిక హంగులు, టెక్నాలజితో అతిథి గృహ పునర్ నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. అధికారులు రూపొందించిననమూనా చిత్రాలను మంత్రి పరిశీలించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రికి మొక్కలపై అమితమైన మక్కువ, అభిమానం కలిగి ఉంటారని ఆ దిశగానే హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నారని, మొక్కలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భవనం లోపన నిర్మాణ తీరును పరిశీలించి నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా కాంట్రాక్టర్లు కృషి చేయాలని పేర్కొన్నారు. పార్కింగ్ మొదలు, భవనంపై భాగం వరకు అన్ని గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్‌రావు, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్, ఆర్‌అండ్‌బి ఈఈ సాంబశివరావు, ఏఈ రాజశేఖర్, నాయకులు చల్ల హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News