- Advertisement -
కరీంనగర్: రైతు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హుజురాబాద్‌లో 110 రైస్ మిల్లర్ల యజమానులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశమయ్యారు. టిఆర్‌ఎస్ వెంటే ఉంటామని మంత్రి గంగులకు రైస్ మిల్లర్స్ యజమానులు లేఖ ఇచ్చారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడారు. కరోనా కష్ట కాలంలోనూ రైతు బంధు నగదు వేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని, 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని సిఎం కెసిఆర్ అభివృద్ధి చేశారని గంగుల పేర్కొన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్వలాభం కోసం హుజురాబాద్ అభివృద్ధిని గాలికొదిలేసి రాజకీయాల్ని వాడుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ గెలిస్తేనే హుజురాబాద్‌లో అభివృద్ధి సాధ్యమన్నారు.
- Advertisement -