హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దర్యాప్తు సంపూర్ణంగా తనిఖీలు పూర్తి చేయండని, నిజా నిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదని తెలిపారు. ఈడి అధికారులకు ఇంటి తాళాలు తీయాలని వీడియో కాల్‌లో చేప్పానని అన్నారు. ఇంట్లోని ప్రతి లాకర్‌ను ఓపెన్ చేసి చూసుకొమ్మని చెప్పానని, సోదాల్లో ఎంత క్యాష్ దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో వారే చెప్పాలని అన్నారు. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివని స్పష్టం చేశారు. బయట దేశాల నుంచి డబ్బులు హవాలా ద్వారా తెచ్చామని ఈడి, అక్రమంగా డబ్బలు నిల్వ ఉంచామని ఐటి శాఖ తనిఖీలు చేస్తోందని తెలిపారు. గతంలో మాపై చాలామంది ఈడి, ఐటికి ఫిర్యాదు చేశారని, దానిని మేం స్వాగతించామని తెలిపారు. పారదర్శకంగా వ్యాపారం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ అన్ని అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నామని తెలిపారు.
Gangula Kamalakar responds on ED Raids