Monday, December 23, 2024

సిఎంఆర్ సేకరణ వేగవంతం చేయాలి: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Gangula Kamalakar review with Civil Supplies Dept Officials

హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలోని ఉన్నతాధికారులు, జిల్లాల డీఎస్వో, డీఎంలతో ఈరోజు సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సీఎంఆర్, రాబోయే వానాకాలం పంట సేకరణ అంశాలపై ఉద్యోగులతో సుధీర్ఘంగా చర్చించారు. ఎఫ్.సి.ఐ సిఎంఆర్ సేకరణ పునరుద్దరించిన తర్వాత జరుగుతున్న మిల్లింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, ఖచ్చితమైన నిభందనలు పాటిస్తూ గడువులోగా మిల్లింగ్ కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మిల్లింగ్లో జాప్యానికి అధికారులదే బాధ్యత అన్న మంత్రి అతి త్వరలోనే స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తానని సిఎంఆర్లో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేంక్షించేది లేదన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్సీఐ వైఖరితో పాటు, మిల్లర్లకు సంబందించిన అంశాలపై సుధీర్ఘ కసరత్తు చేసారు. జిల్లాల్లో మొన్నటి వానలకు తడిసిన ధాన్యం ఎంత ఉంది అనే వివరాలతో పాటు, ఈ వానాకాలం సేకరించాల్సిన ధాన్యం పరిమాణంపై వారంలోగా సమగ్ర నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. దానిపై మరోసారి సమావేశం నిర్వహిద్దామన్నారు.
ఇప్పటికే పెద్ద ఎత్తున దాదాపు 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువవున్న నేపథ్యంలో వచ్చే వానాకాలం ధాన్యం నిలువ వుంచడానికి గల ఇంటర్మీడియట్ స్టోరేజీలను గుర్తించాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం క్రమం తప్పకుండా మిల్లులను తనిఖీ చేస్తూ మిల్లింగ్ ప్రక్రియతో పాటు అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఇందుకోసం టాస్క్ పోర్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారిచేసారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీడీఎస్ బియ్యం రీసేల్, రీసైకింగ్ల్ జరగకుండా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. సంక్షేమ గురుకులాలకు, హాస్టళ్లకు, విద్యాలయాలకు అందించే బియ్యం సరైన నాణ్యతతో కూడిన పాత బియ్యం మాత్రమే అందించాలన్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సక్రమంగా పనిచేసే అధికారులను ప్రశంసిస్తూనే, విదినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నవారిని ఉపేక్షించేది లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Gangula Kamalakar review with Civil Supplies Dept Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News