Sunday, December 29, 2024

యువతకు అన్యాయం చేసే ప్రభుత్వం మాది కాదు: గంగుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ యువతకు అన్యాయం చేసే ప్రభుత్వం తమది కాదనీ, టిఎస్‌పిఎస్సీ ఘటనపై ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. శాసనమండలి చీఫ్ విప్ టి.భానుప్రసాద్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, బిఆర్‌ఎస్ కార్మిక విభాగం నేత రూప్‌సింగ్‌తో కలిసి ఆదివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీ పాదయాత్రలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి పాదయాత్ర కనుమరుగు అయ్యేందుకు రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి సోయిలేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

టిఎస్‌పిఎస్సీ ఘటనను కాంగ్రెస్, బిజెపి పార్టీలు బయటపెట్టలేదనీ, తమ ప్రభుత్వమే బయటపెట్టిందన్నారు. టిఎస్‌పిఎస్సీ ఘటన గురించి ప్రభుత్వానికి తెలియగానే వెంటనే సిట్ వేసిందని ఆయన తెలిపారు. టిఎస్‌పిఎస్సీ స్కాం కాదనీ, ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమేనన్నారు. రోశయ్య ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, అప్పటి ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. 2010లో యూపిపిఎస్సీలో ఐపిఎస్ అధికారి తప్పు చేస్తే ప్రధాని రాజీనామా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక, యూపీ, గుజరాత్‌లో ఇలాంటి ఘటనలు జరిగాయని అక్కడి మంత్రులు, ప్రభుత్వాలు రాజీనామా చేశారా? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పారదర్శకంగా ఉన్నందును పరీక్షలు రద్దు చేశామని, విపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌పై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. స్కామ్‌లకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు. షర్మిలకు కనీసం అవగాహన లేకుండా సిరిసిల్ల పోయారని ఆయన ఎద్దేవా చేశారు. కేసు నమోదు చేసినప్పుడు కాంగ్రెస్, బిజెపిలకు కనీస సమాచారం లేదనీ, రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కెటిఆర్ పిఏ గ్రామం పక్కనే ఉండటం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News