కరీంనగర్: ముఖ్యమంత్రి కెసిఆర్ వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని 42వ డివిజన్ లో మంత్రి గంగుల కమలాకర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.133 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. వీటితో కరీంనగర్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మి ఓట్లు వేస్తే తెలంగాణ భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ కు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, 42వ వార్డు కార్పోరేటర్ మేచినేని వనజ అశోక్ రావు, బీఆర్ఎస్ లీడర్లు డి. రవి, ఆవుల సత్యనారాయణ, యూత్ ప్రెసిడెంట్ బడికెల కిరణ్ తో పాటూ వార్డు సభ్యులు పాల్గొన్నారు.