Monday, December 23, 2024

గాంధీ సినిమాను వీక్షించిన మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Gangula kamalakar watched gandhi Movie

హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.  రాష్ట్ర బి సి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రతిమ మల్టీ ఫ్లెక్స్ లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, కలెక్టర్ కర్ణన్, సి పి సత్యనారాయణ, మేయర్ సునీల్ రావులతో కలసి గాంధీ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థుల కోసం గాంధీ చిత్ర ప్రదర్శన ఈ నెల 9,10,11 తేదీలతో పాటు 16,17,18,19,20,21 తేదీలలో కరీంనగర్ జిల్లాలోని 13 థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తామ‌ని చెప్పారు.  వజ్రోత్సవాలలో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి -హరిశంకర్ అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, కమీషనర్ సేవా ఇస్లావత్,  కార్పొరేటర్లు మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News