కరీంనగర్: హుజురాబాద్ పట్టణములో ప్రతాప సాయి గార్డెన్ లో భూమి ఆధీనం, నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్, ఇంటి అనుమతుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”నలభై ఏళ్లు.. దరఖాస్తు ఇచ్చాం… దండం పెట్టాం. ఇంటి పట్టా ఇవ్వండన్నాం. కరెంటు పెట్టమన్నాం. నల్లా కనెక్షన్ ఇవ్వమన్నాం. కానీ ఇవ్వలేదు. నలభై ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 450 మంది మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఇంటి పత్రాలు పొందడం జరిగింది.
సిఎం కెసిఆర్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లడంతో వెంటనే హరీశ్ రావు చొరవతో ఈ కల సాకారమయింది. ఇక మీ ఇంటిపై సర్వహక్కులు మీవే. తెలంగాణ తెచ్చుకున్నది ఇందు కోసమే. ఆడ బిడ్డల పెళ్లీలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం. గతంలో బిడ్డ పెళ్లి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. మేనమామగా సీఎం కేసీఆర్ లక్ష నూట పదహార్లు ఇస్తున్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి. మోడీ పాలించిన రాష్ట్రం ఉంది. యూపీ వంటి బీజేపీ పాలిత రాష్ట్రం ఉంది. ఎక్కడైనా పెదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చారా. తెలంగాణకు ముందు కాంగ్రెస్, టీడీపీ వంటి ప్రభుత్వాలు ఎనాడు పేదలను పట్టించుకోలేదు. తెలంగాణ రాకముందు కరెంటు ఉండేదా…తాగు నీరు వచ్చేదా. నీళ్లు లేక నానా ఇబ్బందులు పడ్డాం. అందుకే తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అని సిఎం కేసీఆర్ తెలంగాణ సాదించారు. బడుగు, బలహీన వర్గాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం” అని అన్నారు.
Gangula Kamalaker Speech at Huzurabad