Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Gangula reviewed arrangements for CM KCR public meeting

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో జరిగే బహిరంగ సభ ప్రాంగణాన్ని మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం పరిశీలించారు. కెసిఆర్ పర్యటనతో పెద్దపల్లి గులాబీ మయమైంది. సిఎం కిసీఆర్ ను స్వాగితిస్తూ హోర్డింగులు ఏర్పాటు చేశారు. రాజీవ్ రహదారి మొత్తం స్వాగత తోరణాలతో నిండిపోయింది. ముఖ్యమంత్రి జిల్లా కేంద్రానికి సోమవారం రానుండడంతో అభిమాన నేతను స్వాగతిస్తూ టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హోర్డింగులు, కటౌట్లు, ఫ్లెక్సీలు, బెలూన్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించడానికి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనుండటంతో సిఎం కెసిఆర్ కు ఘనస్వాగతం పలికేందుకు టిఆర్​ఎస్ నేతలు, పార్టీ​ శ్రేణులు సిద్ధమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News