Monday, January 20, 2025

ఇడి విచారణకు హాజరైన శ్వేత గ్రానైట్ సంస్థ ప్రతినిధి గంగుల వెంకన్న

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : శ్వేత గ్రానైట్ కంపెనీకి చెందిన గంగుల వెంకన్న సోమవారం ఇడి అధికారులు ప్రశ్నించారు. మూడ్రోజుల క్రితం శ్వేత గ్రానట్ సంస్థ యాజమాన్యానికి ఇడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న శ్వేత గ్రానైట్ సంస్థకు చెందిన గంగుల వెంకన్న సోమవారం విచారణకు హాజరయ్యారు. గంగుల వెంకన్న నుండి ఇడి అధికారులు పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు.

ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రంలో పలు గ్రానైట్ సంస్థల్లో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. శ్వేత గ్రానైట్, శ్వేత ఏజన్సీ, వెంకటేశ్వర గ్రానైట్స్, పిఎస్‌ఆర్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ సంస్థల్లో ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, కరీంగనర్‌లలో సుమారు 30 టీమ్‌లు సోదాలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ సహా టిఆర్‌స్‌కు చెందిన ఎంపి గాయత్రి రవికి చెందిన గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో కూడా ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా రూ.1.80 కోట్ల నగదును సీజ్ చేసినట్లుగా ఇడి ప్రకటించింది. హవాలా రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లుగా ఇడి ప్రకటించింది.

ఎగుమతి చేసిన గ్రానైట్ తకుకవ పరిమాణంలో చూపడం ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను ఎగ్గొట్టిందని ఇడి తెలిపింది. సుమారు రూ.750 కోట్లను గ్రానైట్ సంస్థలు ఎగ్గొట్టాయని కూడా ఇడి ఈ నెల 11న స్పష్టం చేసిన విషయం విదితమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గ్రానైట్ కంపెనీలపై ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు ఆధారంగా ఇడి రంగంలోకి దిగింది. ఈ నెల 9,10 తేదీల్లో ఇడి, ఐటి అధికారులు సోదాలు జరిపిన సమయంలో ఆయన దుబాయ్‌లో ఉన్నారు. ఇడి అధికారుల సోదాల విషయం తెలుసుకున్న తర్వాత ఆయన దుబాయ్ నుండి కరీంనగర్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News