Friday, November 22, 2024

దాదాకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

Ganguly 49th birthday celebration

 

కోల్‌క‌తా: బిసిసిఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ గురువారం త‌న 49వ పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కు అతడు చేస్తున్న సేవలను అభిమానులు, క్రికెటర్లు గుర్తు చేసుకున్నారు. దాదాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా క్రికెట్‌, యూరో, కోపా అమెరికా ఫుట్‌బాల్‌, ఒలింపిక్స్‌కు సంబంధించి రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు. క‌రోనా కార‌ణంగా త‌న బ‌ర్త్‌డేను ఇంట్లోనే సింపుల్‌గా జ‌రుపుకున్నట్లు దాదా చెప్పారు. 55 ఏళ్ల త‌ర్వాత యూరోలో ఇంగ్లండ్ ఫైన‌ల్‌కు వ‌చ్చింద‌ని, త‌న‌కు సంతోషంగా ఉంద‌ని అన్నారు. ఇక కోపా అమెరికాలో బ్రెజిల్‌, అర్జెంటీనా మ్యాచ్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పారు. త‌న స‌పోర్ట్ ఎప్పుడూ బ్రెజిల్‌కే ఉంటుంద‌ని గంగూలీ అన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఇండియ‌న్ టీమ్ ఈసారి చాలా మెడ‌ల్స్ తీసుకొచ్చే అవ‌కాశం ఉన్న‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

అంకితభావం, దార్శనికతలో దాదాతో కొంతమందే సరిపోలుతారు. ఎప్పటిలాగే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి దాదా. పుట్టిన రోజు శుభాకాంక్షలు దాదా అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.

పుట్టిన రోజు శుభాకాంక్షలు గంగూలీ. జీవితంలోనే అతిపెద్ద ఆనందం, ఆశీర్వాదాలు నీకు దక్కాలి. ఈ ఏడాదంతా బాగుండాలని వివిఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News