బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ
కోల్‌కతా: టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించడంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి స్పందించాడు. కోహ్లి స్థానంలో రోహిత్‌ను ఎంపిక చేయడానికి గల కారణాలను వెల్లడించాడు. వన్డేలు, ట్వంటీ20 ఫార్మాట్‌కు వేర్వేరు కెప్టెన్లు ఉంటే జట్టుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నాడు. అందుకే టి20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగాలని తాను కోహ్లిని కోరానన్నాడు. అయితే విరాట్ మాత్రం దీనికి ఒప్పుకోలేదన్నాడు. దీంతో రెండు ఫార్మాట్‌లకు ఒకరే కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కోహ్లి స్థానంలో రోహిత్‌ను నియమించామని గంగూలీ స్పష్టం చేశాడు. అంతేగాక వన్డేల్లో రోహిత్ కెప్టెన్సీ రికార్డు మెరుగ్గా ఉండడాన్ని కూడా తాము పరిగణలోకి తీసుకున్నామన్నాడు. అంతే తప్ప కోహ్లిని తప్పించేందుకు వేరే కారణాలు ఏమీలేవన్నాడు. కాగా, సెలెక్టర్లు కూడా తెల్లబంతి ఫార్మాట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలని సూచించారన్నాడు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రోహిత్‌ను వన్డేలకు కూడా కెప్టెన్‌గా నియమించాని గంగూలీ వివరించాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలు వెల్లడించాడు.