హైదరాబాద్: ఇప్పటికే టీమిండియా గత ఏడు వారాలలో ఐదు టెస్టులు ఆడిందని, భారత జట్టుకు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ లేదని పదం వాడకూడదని మాజీ కెప్టెన్ గంగూలీ తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సందర్భంగా విమర్శకులకు గంగూలీ రీకౌంటర్ ఇచ్చారు. ఇంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించాడు. న్యూజిలాండ్ సిరీస్ వైట్ వాష్ అయిన తరువాత భారత జట్టు ప్రభావం ఉంటుందని తాను అనుకుంటున్నానన్నారు.
భారత్‌లో పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని, ఆస్రేలియాలో పిచ్ పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు. ఆసీస్ పిచ్‌లపై నిలుదొక్కుకుంటే బ్యాటింగ్ చేయడం సులభం అవుతుందన్నారు. భారత్‌లో స్పిన్ పిచ్‌లే కాకుండా సీమ్‌కు అనుకూలంగా ఉంటే పిచ్‌లను తయారు చేయాలని సూచించారు. టర్నింగ్ పిచ్‌లపై ఓపికతో బ్యాటింగ్ చేయడంతో పాటు ఎటాకింగ్ చేయాలని సూచించారు. ఆసీస్ గడ్డపై బ్యాటర్లు నిలకడ ప్రదర్శించకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని గంగూలీ హెచ్చరించారు.
టీమిండియా తుది జట్టు అంచనా: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, అశ్విన్, సిరాజ్, ఆకాశ్ దీప్ , జస్ప్రీత్ బుమ్రా