Friday, December 27, 2024

గంగూలీ -షా విందులో వెజ్ మసాలా

- Advertisement -
- Advertisement -

Ganguly hosted dinner for Union Home Minister Amit Shah

సందడిగా మారిన క్రికెటర్ నివాసం

కొల్‌కతా : ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తన నివాసంలో విందు ఇచ్చారు. క్రికెట్ బోర్డు చీఫ్‌గా ఉన్న గంగూలీ ఇంటికి ఇప్పుడు కలకత్తా పర్యటనలో ఉన్న అమిత్ షా వెళ్లారు. హోం మంత్రి కుమారుడు జయ్ షా గంగూలీకి మంచి స్నేహితుడు. పైగా క్రికెట్‌బోర్టులోఆయన కూడా కీలక పాత్ర లో ఉన్నారు. ఈ విందులో రాజకీయ ప్రాధాన్యత ఏదీ లేదని ఆ తరువాత గంగూలీ విలేకరులకు తెలిపారు. తనకు అమిత్ షా చాలా కాలంగా తెలుసునని, పలుసార్లు భేటీ అయ్యామని తెలిపారు. ఆయన ఇక్కడికి వచ్చారని తెలియగానే విందుకు ఆహ్వానించినట్లు వివరించారు. ఆయన కొడుకు కూడా బాగా పరిచయం అన్నారు.

విందు జరిగింది. విందు విశేషాలేమిటీ? అని విలేకరులు ప్రశ్నించగా అంతా శాఖాహారమే, విశేష మసాలాలేమీ లేవు , కావాలంటే తనిఖీ చేసుకోవచ్చు అని నవ్వుతూ గంగూలీ తెలిపారు. బెంగాల్‌లో ప్రతిసారీ ఎన్నికలప్పుడు గంగూలీ బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వెలువడటం వీటిని ఆయన ఖండించడం జరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో దాదా వర్సెస్ దీదీ జరుగుతుందని గంగూలీ, మమత మధ్య ఎన్నికల రాజకీయ సమరం ఉంటుందని ప్రచారం జరుగుతూ వచ్చాయి. అయితే ఇదేదీ నిజరూపం దాల్చలేదు. ఇప్పుడీ విందు దశలో ఇది ప్యూర్ వెజ్ అని గంగూలీ చెప్పినా దీనికి మరోదే అన్వయించుకునేందుకు రాజకీయ వర్గాలు సిద్ధం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News