Saturday, November 2, 2024

ధోనీని మెంటార్‌గా అందుకే ఎంపిక చేశాం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీ20ల్లో ఘనమైన రికార్డు ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనుభవం టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు ఉపయోగపడుతుందనే అతన్ని టీమిండియా మెంటార్‌గా ఎంపిక చేశామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరిగే మెగా టోర్నీ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించిన సెలెక్షన్ కమిటీ.. ధోనీని మెంటార్‌గా జట్టులోకి తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు మెంటార్‌గా ధోనీ ఏం చేస్తాడని, కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, సపోర్టింగ్ స్టాఫ్ ఉండగా.. అతను చేసేదేం ఉండదని గంభీర్, అజయ్ జడేజా వంటి మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు. తాజాగా టెలిగ్రాఫ్‌కు దాదా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ధోనీని టీమిండియా మెంటార్‌గా ఎంపిక చేయడానికి గల ప్రధాన కారణాన్ని వివరించాడు. ధోనీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని, 2019లో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా సపోర్టింగ్ స్టాఫ్‌గా ఎలాంటి పాత్ర పోషించాడో.. టీ20 ప్రపంచకప్‌లో ధోనీది కూడా అలాంటి పాత్రేనని చెప్పుకొచ్చాడు. 2013 నుంచి భారత్ ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదని, ఈ సారి ఎలాగైన టైటిల్ కొట్టాలనే లక్ష్యంతోనే ప్రణాళికలు రచించామన్నాడు.

Ganguly Reacts on Dhoni being Mentor of India

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News