Thursday, January 23, 2025

అది కోహ్లీ వ్యక్తిగతం: గంగూలీ

- Advertisement -
- Advertisement -

ముంబై : గత ఏడాది టి20లు, వన్డేలకు సంబంధించి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. తాజాగా టెస్టు కెప్టెన్సీకీ గుడ్ బై చెప్పేశాడు. కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అయితే కోహ్లీ నిర్ణయంపై బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బిసిసిఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో భారత క్రికెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. భవిష్యత్‌లోనూ ఈ జట్టును మరింత ఎత్తుకు తీసుకువెళ్లడంలో కోహ్లీ కీలక సభ్యుడిగా ఉంటాడు. విరాట్ అద్భుత ఆటగాడు. వెల్‌డన్’ అంటూ గంగూలీ ట్వీట్ చేశాడు. అయితే గతంలోనూ వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ను తప్పించిన సమయంలో బిసిసిఐకి, కోహ్లీకి మధ్య ఓ వార్ నడిచింది. టి20ల కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పుకోవద్దని తాము రిక్వెస్ట్ చేశామని గంగూలీ చెప్పగా.. ఆ వ్యాఖ్యలను కోహ్లీ ఖండించాడు. ఆ సమయంలో తననెవరూ కెప్టెన్‌గా కొనసాగమని చెప్పలేదన్నాడు. వన్డే కెప్టెన్‌గా కూడా తొలగించేముందు గంట ముందు మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని కోహ్లీ ఆరోపించింది విధితమే.

Ganguly reacts on Kohli quit as test captain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News