Thursday, December 26, 2024

గంగూలి కుటుంబంలో కరోనా కలకలం..

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలి ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. ఆయన కుటుంబంలోని నలుగురికి కరోనా సోకింది. గంగూలీ కూతురు సనాతోపాటు మరో ముగ్గురికి కరోనా పాజిటీవ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యులు, కుటుంబ సభ్యులందరినీ హోం ఐసోలేషన్ లో ఉంచారు. కాగా, ఇటీవల కరోనా పాజిటీవ్ నిర్ధారణ కావడంతో కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్స్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌లో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన గంగూలి 14 రోజులపాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, హోం ఐసోలేషన్ లో ఉంటున్న గంగూలి డెల్టాప్లస్ వేరియంట్ బారిన పడ్డారు. దీంతో ఆయనకు ఇంటివద్దే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు ఉండటంతో దాదా కూతురు సనా ఈరోజు కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటీవ్ నిర్దారణ అయ్యింది.

Ganguly’s Daughter test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News