Monday, December 23, 2024

బాక్సర్‌గా చేయడం ఆనందాన్నిచ్చింది

- Advertisement -
- Advertisement -

Gani Movie

 

అల్లు అరవింద్ సమర్పణలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గని’. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర నటీనటులుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ కంపెనీ, రెన్సాన్స్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ “చిన్నతనంలో నాకు బాక్సర్ కావాలని ఉండేది. కానీ నటుడిని అయ్యాను. కానీ ‘గని’లో బాక్సర్ పాత్ర లభించడంతో ఎంతో ఆనందంగా ఉంది. కరోనా సమయంలో దర్శక నిర్మాతలు నన్ను ఈ పాత్ర కోసం సంప్రదించారు. ఈ సినిమా షూటింగ్ రెండు, మూడు సంవత్సరాలు జరిగింది. ఇక సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఫిట్‌నెస్ మెయింటేన్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమిది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News